Thursday, December 11, 2008
భయాన్ని వీడండి.
భయం మనిషిని విహ్వలుణ్ణి చేస్తుంది. విహ్వలత వాస్తవానికి దూరంగా తీసుకువెళ్తుంది. తద్వారా ఏర్పడే వ్యాకులత మరింత భయాన్ని కలుగచేస్తుంది. ఇది ఒక ఊబి లాంటిది. మనిషి ఎంత త్వరగా దీనిలోనించి బయట పడితే అంత మంచిది. లేనట్లైతే కలిగే నష్టం అపారం. నిజానికి వాస్తవం ఎప్పుడు మన ఉహల్లోని భయానికి దూరంగా ఉంటుంది. ఈ వాస్తవం మనల్ని నమ్మశక్యం కానంత భద్రంగా ఉంచుతుంది. వాస్తవం ఎంతో అందంగా ఉంటుంది. అందుకే భయాన్ని వీడండి. వాస్తవాన్ని ఎదుర్కోండి. చక్కని అనుభూతిని సొంతం చేసుకోండి. మీరెంత ఉల్లాసంగా జీవితాన్ని గడపగలరో గమనించండి. వాస్తవం ఎప్పుడు భయంకంటే చేదుగా ఉండదు. భయమే మన శత్రువు. భయమే మన బందిఖానా. భయాన్ని వీడండి. నిర్భయంగ జీవించండి.
Monday, November 24, 2008
విలువలను దిగజార్చుకోకండి
జెపి పై పొన్నాల వ్యాఖ్యలు గర్హనీయం. కాని పొన్నాల స్థాయి అది. దానికి loksatta ధర్నా చేయటం, రోడ్డుకెక్కటం మిగిలిన పార్టీలను అనుకరించినట్లవుతుంది. అది పార్టీ విధానం కారాదు. jp పరిజ్ఞానాన్ని గురించి వ్యాఖ్యానించటం ద్వారా పొన్నాల తన అజ్ఞానాన్ని బయట పెట్టుకున్నారు. దాన్ని నిరసన ద్వారా ఖండించవచ్చు. పత్రికల్లో వివరణ ద్వారా పొన్నాల అజ్ఞానాన్ని ఎండకట్టవచ్చు. కాని వీధులకెక్కటం అర్ధరహితం. ఒకవేళ కాంగ్రెస్ కార్యకర్తలు బరిలోకి దిగినట్లైతే బహాబాహికి సిద్ధపదేవారా? ఇది ఆ సందర్భమా?
Subscribe to:
Comments (Atom)