Thursday, December 11, 2008

భయాన్ని వీడండి.

భయం మనిషిని విహ్వలుణ్ణి చేస్తుంది. విహ్వలత వాస్తవానికి దూరంగా తీసుకువెళ్తుంది. తద్వారా ఏర్పడే వ్యాకులత మరింత భయాన్ని కలుగచేస్తుంది. ఇది ఒక ఊబి లాంటిది. మనిషి ఎంత త్వరగా దీనిలోనించి బయట పడితే అంత మంచిది. లేనట్లైతే కలిగే నష్టం అపారం. నిజానికి వాస్తవం ఎప్పుడు మన ఉహల్లోని భయానికి దూరంగా ఉంటుంది. ఈ వాస్తవం మనల్ని నమ్మశక్యం కానంత భద్రంగా ఉంచుతుంది. వాస్తవం ఎంతో అందంగా ఉంటుంది. అందుకే భయాన్ని వీడండి. వాస్తవాన్ని ఎదుర్కోండి. చక్కని అనుభూతిని సొంతం చేసుకోండి. మీరెంత ఉల్లాసంగా జీవితాన్ని గడపగలరో గమనించండి. వాస్తవం ఎప్పుడు భయంకంటే చేదుగా ఉండదు. భయమే మన శత్రువు. భయమే మన బందిఖానా. భయాన్ని వీడండి. నిర్భయంగ జీవించండి.