ఆమె
నింగిలో సగం, నేలలో సగం.
కళ్ళు తెరచిన క్షణాన అమ్మగా కన్పించే ఆమె.
అక్కా చెల్లిగా ఆడించి మురిపించే ఆమె
భార్యగా భర్తకు తానై జీవితాన్ని అర్పించే ఆమె
తండ్రికి బిడ్డగా, తానే తల్లిగా..... కనుమూసే క్షణాన తల నిమురుతూ ఆమె.
సృష్ట్యాది నుండి పురుషుడికి ఆస్తిగా ఆమె
బానిస సంకెళ్ళు తెంచుకుని పిడికిలెత్తిన ఆమె
నేనున్నానంటూ నినదించిన ఆమె
నీతో సమమంటూ పోటి పడుతున్న ఆమె
ఎన్నాళ్ళిలా, ఎన్నేళ్ళిలా?
ఇకనైనా ఉంటుందా ఉషోదయం,
స్త్రీ జాతికి మహోదయం.
Wednesday, April 14, 2010
Monday, March 8, 2010
తెలంగాణా ఇస్తే తప్పేంటి?
ఐదున్నర దశాబ్దాలుగా నిశ్సబ్దంగా ఉన్న ప్రత్యెక కాంక్ష ఒక్క ప్రకటనతో ఉవ్వెత్తున ఎగసిన కెరటంలా ముందుకు దూసుకు రావటం తెలంగాణా ప్రజల్లో నిద్రాణంగా ఎంతటి నిరసన దాగి ఉందొ తేటతెల్లం చేస్తుంది. ఇంకా జాప్యం చేసి ప్రజల్లో వైమనస్యాలు పెంచకుండా ఇరువైపుల సంతృప్తి పరిచేలా రాష్ట్ర విభజన జరగటం శ్రేయోదాయకం.
Subscribe to:
Comments (Atom)