నవ్వొస్తోంది జీవితాన్ని చూస్తే
నన్నే చూసి నవ్వాలనుకుంటోంది
పిచ్చిది దానికి తెలియదు
గడిచే ప్రతి ఘడియానన్ను రాటు తేలుస్తోందని
ప్రతి అనుభవం నన్ను రాగద్వేషాల కతీతంగా రాయిని చేస్తోందని
కలలుగనే నా మనసు కల్లలు కాగానే కన్నీరు కాదని
క్షణం పాటు తొట్రు పడినా మరు క్షణమే మరో పోరాటానికి సిద్ధం అవుతుందని
జీవితకాలం నాతో నడిచిన ఈ జీవితానికి తెలియదు
అందుకే నన్ను చూసి నవ్వుతోంది.
నవ్వనీ . ఎంత కాలం నవ్వుతుంది?
నే గమ్యం చేరేదాకానేగా దాని నవ్వు
ఆ తరువాత నేనే నవ్వుతా మనసారా
పగలబడి మరీ నే నవ్వుతా
కాని చూసేందుకు ఈ జీవితం ఉండదుగా.
Thursday, February 24, 2011
Subscribe to:
Comments (Atom)