Sunday, December 25, 2011

brathakaali

కోరినదెల్లా  జీవితం అయితే
మనిషి కోరికలకు అంతేం ఉంటుంది?

కోరికలన్నీ తీరితే
ఇక మనిషి మనుగడకు
అర్ధం ఏం ఉంటుంది?

అర్ధం అయ్యీ కానిదే జీవితం
రొజూ సరికొత్త కల గనడమే జీవితం
కన్న కలలను సాకారం చేసుకో ప్రయత్నించడమే జీవితం
ఒడిదుడుకుల సాగరంలో ధైర్యంగా సాగడమే జీవితం

ఓటమి సరికొత్త ప్రయత్నానికి నాంది పలకాలి
ప్రతి ప్రయత్నం కొత్త పుంతలు తొక్కాలి
పగిలే గుండెలను చిక్క బట్టుకుని
తల ఎత్తి నడవాలి
నాతో సమం ఎవరూ కారని
గుండెల నిండుగా నమ్మాలి

నిన్న నేడు కాదు
నేడు రేపు కాదు
వెరపు ఎన్నటికి నిజం కాదు

శ్వాస తీసిన నాటినుండి
శ్వాస వదిలేవరకు
ప్రతి క్షణం జీవించాలి
జీవించిన ప్రతి క్షణం మనదిగా బ్రతకాలి.