Tuesday, January 15, 2013

అమ్మ ఆకలి.

అమ్మ ఆకలి.

అమ్మ, ... ఆకలితో ఉంది 
తన కడుపు నిండలేదని కాదు,
గుక్క పట్టి ఏడుస్తున్న తన బిడ్డ కడుపు నింపాలని.

అమ్మ, .... ఆకలితో ఉంది 
బడికి వెళ్ళిన బిడ్డ బాగా చదువుకోవాలని
సమాజంలో ఉన్నతంగా ఎదగాలని.

అమ్మ, ...ఆకలితో ఉంది 
తన బిడ్డ మంచి ఉద్యోగంలో స్థిర పడాలని
ఏ లోటూ లేకుండా జీవించాలని.

అమ్మ, ...ఆకలితో ఉంది
బిడ్డకు తన లాంటి మంచి అమ్మాయి 
భార్యగా రావాలని, తన బిడ్డను తనలా 
కంటికి రెప్పలా  చూసుకోవాలని.

అమ్మ, ...ఆకలితో ఉంది
బిడ్డకు మంచి బిడ్డలు పుట్టాలని 
వార్ధక్యంలో బిడ్డ సుఖంగా జీవించాలని.

అమ్మ, ...ఆకలితో ఉంది
తనని వదలి వెళ్ళిన భర్త లోటు 
తన బిడ్డ జీవితంలో పడకూడదని. 

అమ్మ, ...ఆకలితో ఉంది
తనని నిర్లక్ష్యం చేస్తున్నానన్న భావన  

తన బిడ్డను 

ఆ మచ్చ పడకూడదని.

అమ్మ, ...ఆకలితో ఉంది
చివరి శ్వాస కు దగ్గరైన తాను 
తన బిడ్డకు భారం కాకూడదని.

ఆఖరి వీడ్కోలులో అమ్మ 
ఆశీర్వదిస్తూ అమ్మ