Tuesday, July 1, 2014

అభివృద్ది పై దృష్టి సారించండి.

రాష్ట్రం విభజన జరిగి నెల పూర్తయింది. ఇంకా రెండు రాష్ట్రాల ప్రభుత్వాల పాలన గాడిలో పడలేదు. ఎన్నో ఆశలతో ఏర్పడిన తెలంగాణా లో కాని, తీవ్ర నిరాశ నిస్పృహల మధ్య మిగిలిన అవశేష ఆంధ్ర ప్రదేశ్ లో కాని ప్రజల సమస్యల పట్ల పాలకుల స్పందన కాన రావటం లేదు. ఇంకా ఒకరిని మరొకరు దుమ్మెత్తి పోసుకోవడం తప్ప. ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇక నైనా పాలకులు పాలన పై దృష్టి పెట్టి అభివృద్ది వైపు అడుగులు వేయాలి.